నెల్లిమర్ల ఈవీఎంల గోదాములో కలెక్టర్ తనిఖీ
అక్షర కిరణం, (విజయనగరం): నెల్లిమర్ల ఈవీఎం గోదాములో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను సోమవారం తనిఖీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఎన్నికల కమిషన్కు చేసిన ఫిర్యాదు మేరకు ఈవీఎంలను ర్యాండంగా తనిఖీ చేయాలని ఈసీఐ ఆదేశించింది. గోడౌన్లోని ఎంపిక చేసిన ఈవీఎంలను భెల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో అప్పల నరసయ్య ఏజెంట్ సమక్షంలో తనిఖీ చేశారు. ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డీఆర్వో ఎస్డీ.అనిత పలిశీలిం చారు. ఈవీఎం నోడల్ ఆఫీసర్ బి.ఉమాశంకర్, తనిఖీ ప్రక్రియ సూపర్వైజర్ జోసెఫ్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.