ఆంధ్ర`ఒడిసా ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు దగ్ధం
కడ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం
కపెను ముప్పు తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
అక్షర కిరణం, (సాలూరు): ఆంధ్ర ఒడిసా ఘాట్ రోడ్డు రోడ్డవలస సమీపంలో విశాఖ పట్టణం నుంచి జైపూర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు దగ్ధం అయింది. ఈ సంఘటన ఉదయం గురువారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఆంధ్ర ఒడిసా ఘాట్ రోడ్లో ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు నుండి ఒక్కసారిగా పొగలతో కూడిన మంటలు రేగి బస్సు దగ్ధమైంది. ఆర్టీసీ డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ వెంటనే కిందకు దిగిపోయారు. భయాందోళనలతో బస్సు నుంచి దూరంగా పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులందరూ ప్రాణాలతో సురక్షితంగా బయట పడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే కర్నూల్ జిల్లాలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుని మొత్తం 20 మంది సజీవదహనమైన సంఘటన తెలిసిందే. తాజాగా రోడ్డవలస ప్రమాదంలో డ్రైవర్ అప్రమత్తత వల్ల ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.