రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
కఆనందపురం, మధురవాడ, పెదగంట్యాడ, ఆఫీసుల్లో దాడులు కపలు కీలక పత్రాలు స్వాధీనం
కఎస్సార్వో కార్యాలయాలు అవినీతికి నిలయాలు కఅవినీతిలో ఆధ్యాత్మిక రోహనుడు
కఏసీబీ అధికారులు గుర్తించిన కీలక పత్రాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా భోగాపురం, ఆనందపురం, మధురవాడ, పెదగంట్యాడ, ప్రాంతాల్లోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భారీ ఎత్తున అకతవక లు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌లో ఉల్లంఘనలు, రిజిస్ట్రేషన్ కోసం పెండిరగ్లో ఉంచిన పత్రాలు, పార్టీలకు జారీ చేయని రిజిస్టర్డ్ పత్రాలు, నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్, నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్స్ అమ్మకాల రిజిస్టర్లలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. దీంతో ఈ సబ్‌రిజిస్టర్ కార్యాల యాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మధురవాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో కార్యాలయం వెలుపల పెద్ద సంఖ్యలో కక్ష్షిదారులు నిరీక్షిస్తున్నారు. ఏసీబీ దాడుల్లో అనేక దస్తావేజులు సేకరించా రని తెలిసింది. పలువురిని విచారణ చేస్తున్నా రు. సబ్ రిజిస్టర్ కార్యాలయ పనిచేయడం తాత్కాలికంగా నిలిపివేసారు. ఈ కార్యాలయం లో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మధు రవాడ సబ్‌రిజిస్టర్ కార్యాలయంతోపాటు పెదగంట్యాడ సబ్రిజిస్టేషన్ కార్యాలయంలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి భోగాపుంర, ఆనందపురం, మధురవాడ, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సబ్ రిజిస్టర్ కార్యాల యాల్లో ఈ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. మధురవాడ, ఆనందపురం సబ్ రిజిస్టర్ కార్యా లయాల్లో కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది తీవ్ర అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణ లు వస్తుండడంతో ఇప్పుడు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో అధికారుల గుండె ల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏవరి మెడమీద ఏసీబీ కత్తి పడుతుందోనని ఆందోళన చెందుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏసీబీ అధికారులు గుర్తించిన అవకతవకలు
కాగా ఈ సోదాల్లో భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేటలో లెక్కల్లో చూపని మొత్తం రూ. 10,000 నుంచి 75,000 వరకు నగదు కనుగోన్నారని సమాచారం. ఈనగదు ఎవరికి చెందినది ఇంకా ధృవీకరణ చేయవలసి ఉన్నదని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంకా, వివిధ రికార్డులు, ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్‌లో ఉల్లంఘ నలు, రిజిస్ట్రేషన్ కోసం పెండిరగ్లో ఉంచిన పత్రాలు, పార్టీలకు జారీ చేయని రిజిస్టర్డ్ పత్రా లు, నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్, నాన్-జ్యుడీషి యల్ స్టాంప్ పేపర్స్ అమ్మకాల రిజిస్టర్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిర్వహిస్తున్న పలు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. సోదాలు పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
అవినీతిలో ఆధ్యాత్మిక రోహన్
పెదగంట్యాడ కార్యాలయంలో పలు కీలక దస్త్రాలు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారు. ఈ కార్యాలయంలో గత ఆరు నెలలుగా సబ్ రిజిస్టర్ రోహన్ బాధ్యతలు తీసు కున్న తరువాత అవినీతి మూడంచెల విధానం లో పెరిగిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈకార్యాలయంలో పైసలు లేనిదే ఏ పని జర గడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎస్ఆర్వో రోహన్ ప్రతి ఫైలుకు తనదైన శైలిలో మూడు రెట్లు అందరికంటే అదనంగా వసూళ్ల పర్వం కొనసా..గిస్తున్న కక్షిదారుల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతడిపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడం, ఆపై సిటీ పరిధి లోనే పనిచేయడానికి అత్యుత్సాహం చూపిం చడం, ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఈ దాడులతో అతని అవినీతి సామ్రాజ్యానికి తూట్లు పడే అవకాశాలు ఉన్నాయని సొంత శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.