బాధ్యతతో విధులను నిర్వర్తించాలి
కనగర మేయర్ పీలా శ్రీనివాసరావు కజీవీఎంసీలో ఏడుగురికి పదోన్నతి
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖపట్నం నగర పాలక సంస్థలో సీనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సిబ్బందికి జీవీఎంసీ పర్య వేక్షకులుగా పదోన్నతి పత్రాలను అందించామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో పర్యవేక్షులుగా పదోన్నతి పొందిన ఏడుగురు సిబ్బందికి పదోన్నతి పత్రాలను జీవీఎంసీ అదనపు కమిషనర్ బీవీ రమణమూర్తి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అప్పలనాయుడుతో కలిసి అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతతో విధులు నిర్వహించి జీవీఎంసీకి మంచి సేవలను, పేరు ప్రఖ్యాతులు తేవాలని, మీరు పని చేసేది ప్రజలతో మేమేకం అయ్యే ఉద్యోగం అయినందున ఒక ఉద్యోగిగా కాకుండా సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని పదోన్నతి పొందిన కె.శ్రీనివాస్, కె.గణేష్, టి.సత్యవేణి, పి.అప్పలనాయుడు, డి.రామతల్లి, బి. సన్యాసిరావు, ఎన్. సంతోష్ కుమార్లకు మేయర్ పీలా శ్రీనివాసరావు సూచించి వారిని ఘనంగా సత్కరించి అభినందించారు.