లండన్‌లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు
అక్షర కిరణం, (లండన్/అంతర్జాతీయం): లండన్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ బహుళజాతి సంస్థ రోల్స్ రాయిస్ గ్రూప్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రోల్స్ రాయిస్ కంపెనీ సీటీవో నిక్కీ గ్రేడీ స్మిత్‌తో సీఎం కేసీఆర్ భేటీ రోల్స్ రాయిస్ ఏరో ఇంజిన్లు, డీజిల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ల తయారీలో అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన బ్రాండ్ ఏపీలో ఉన్న అవకాశాలు, వనరుల గురించి రోల్స్ రాయిస్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ రిపేర్స్ ఓవర్ హాలింగ్ (ఎంఆర్వో) యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు. ఏపీలో ఏరోస్పేస్ కాంపోనెంట్ల ఉత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నాయని రోల్స్ రాయిస్ సీటీవో గ్రేడీ స్మిత్‌కు సీఎం చంద్ర బాబు తెలియజేశారు. విశాఖ, తిరుపతిలో జీసీసీ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. భోగా పురం విమానాశ్రయం సమీపంలో ఏవియేషన్ ఎకోసిస్టమ్, ఎంఆర్ఓ సదుపాయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. శ్రామ్, ఎంఆర్ఏఎం గ్రూప్ చైర్మన్ శైలేష్ హీరానందానితో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సాంకో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్‌కుమార్ మల్లయతో సీఎం సమావేశం అయ్యారు. సెమీ-కండక్టర్లు, ఆధునిక ప్యాకేజింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఎస్.ఆర్.ఏ.ఎం, ఎం.ఆర్.ఏ.ఎం. గ్రూప్ ఆసక్తి కనబరిచిందని సీఎం ఈసందర్భంగా తెలిపారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు ఈ కంపెనీలకు వివరించారు.