51వ వార్డు గాంధీ నగర్లో ‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ’
అక్షర కిరణం, (మాధవధార): విశాఖ ఉత్తర నియోజకవర్గ స్థాయి ‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ’ అనే కార్యక్రమం 51వ వార్డు గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్లో వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైసీపీ విశాఖ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు పాల్గొని ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు..ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, పైడి శ్రీను, బుడుమూరు తిరుమల రావు, పైడి ప్రతాప్, దమయంతి, నూకరాజు, తాడిపూడి రత్నం, వరలక్ష్మి, ధర్మవతి, రాణి, మిడతడ సూర్యనారాయణ, దామోదర్ సూర్యనారాయణ, అప్పారావు, అప్పలరాజు, వెంకట రమణ, కేవీ రాజు, శేషు, పైడి రాజు, సాధు, చిన్ని, భాను, గణేష్, భాస్కర్, సాయికుమార్, జగదీష్ నాయకులు యర్రంశెట్టి శీను, పద్మశేఖర్, సీపాన రాము, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, బూత్ సభ్యులు పాల్గొన్నారు.
రహదారి ఆక్రమణలను తొలగించాలి
కజీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
అక్షర కిరణం, (విశాఖపట్నం): మహా విశాఖ నగరంలో ప్రజలు, వాహనాల రాకపోకలకు రహదారుల ఆక్రమణలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని రోడ్లను ఆక్ర మించి నిర్వహిస్తున్న వ్యాపారాలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటన లో భాగంగా 2 వ జోన్ 8వ వార్డు పరిధిలోని ఎండాడ పరిసర ప్రాంతాలను, త్రిబుల్ ఆర్ సెంటర్‌ను పరిశీలిం చారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ఎండాడ ప్రధాన రహదారిలో రోడ్డును ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యాపారాల ను గమనించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించా లని పట్టణ ప్రణాళికా అధికారులకు ఆదేశించారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులతో కమిషనర్ మాట్లాడుతూ పరిధి దాటి రోడ్లపై వ్యాపారం చేయడం నేరమని, వాటిని స్వచ్చందంగా తొలగించుకోవా లని, జీవీఎంసీ విధించే జరిమానాలకు గురికావద్దని, ఆదే శించారు. ఎండాడ నుండి ఋషికొండ వరకు బీటీ రోడ్డు తోపాటు కాలువలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ తిరుపతిరావు, ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ.ప్రభాకర్ రావు, సీసీపీ ప్రభాకర్‌రావు, జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, సీపీ ధనుంజయ రెడ్డి, డీసీపీ హరిదాసు, డీడీహిెచ్ దామోదర్‌రావు, హార్టికల్చర్ ఆఫీసర్ అర్చన, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, వార్డ్ కార్యదర్శులు, వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన మేయర్ పీలా శ్రీనివాసరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన 8 వ జోన్ 96వ వార్డ్‌లోని పలు ప్రాంతాలలో సుమారు రూ.142.60 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ వార్డుల అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. వార్డులోని ప్రగతి నగర్, లక్ష్మీ నగర్, దాడి అప్పారావు కాలనీ, అయ్యప్ప స్వామి గుడి, రాజ్ చెరువు తదితర ప్రాంతాలలో సుమారు రూ.142.60 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ కాలువలు, సీసీ కల్వర్టులు, ఎస్డబ్ల్యూ కాలువలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, జోనల్ కమిషనర్ బి.హేమావతి, పర్యవేక్షక ఇంజనీరు శ్రీనివాసరావు, కార్యనిర్వహక ఇంజనీరు దిలీప్, ఉప కార్యనిర్వహణ ఇంజినీరు ప్రవీణ్, జీవీఎంసీ సిబ్బంది వార్డు అధ్యక్షులు పి రాజేంద్రప్రసాద్, హెచ్.రామకృష్ణ, శరగడం రాము, శరగడం శంకర్రావు, ఆళ్ల రమేష్ కిల్లి రమేష్, ఆళ్ల రాము, మాజీ గౌరవ సంఘం అధ్యక్షులు శరగడం నరసమ్మ, ఆల త్రినాధ్, ఆళ్ల గణబాబు, అంబిక గణేష్, శరగడం బుజ్జి అచ్చి రామకృష్ణ, నరవ అచ్చిబాబు కూటమి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.