ఢల్లీి ముఖ్యమంత్రిగా అతిశీ బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): దిల్లీ నూతన సీఎంగా ఆతిశీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, తాను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆప్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రామాయణం లోని ఓ సందర్భాన్ని ప్రస్తావించారు. నాకు ప్రస్తుతం భరతుడి కి ఎదురైన పరిస్థితే ఉంది. రాముడు వనవాసానికి వెళ్లిన ప్పుడు భరతుడు పాలించాల్సి వచ్చింది. సింహాసనంపై రాముడి పాదుకలు ఉంచి రాజ్యాన్ని ఏలాడు. ఈ కుర్చీ అర వింద్ కేజ్రీవాల్‌ది. నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో దిల్లీలో మళ్లీ ఆయన అధికారాన్ని చేపడతారని విశ్వసిస్తు న్నాను. ఆయన తిరిగివచ్చేవరకు ఈ కుర్చీ ఇక్కడే ఉంటుం ది’’ అని ఆతిశీ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని, జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలై వచ్చిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమం లోనే తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ పేరును ప్రతిపాదిం చగా.. ఆప్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అంగీకరించడంతో రెండు రోజుల కిందట ప్రమాణస్వీకారం చేశారు. ఆమెతోపాటు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అహ్లావత్, గోపాల్‌రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ కేబినెట్ మంత్రులు ప్రమాణం చేశారు. దీనికిముందు ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ దిల్లీ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చేవరకు తాను ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోనని కేజ్రీవాల్ అన్నారు. అయితే గత ఎన్నిల్లో ప్రజల తీర్పు మేరకు ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ కుర్చీ ఆయనకే చెందుతుంది. వచ్చే ఎన్నికలు జరిగేవరకు మాలో ఒకరు కుర్చీలో కూర్చుంటారు. రాముడు లేనప్పుడు (రామాయణంలో) భరతుడు అయోధ్యను ఎలా పాలించాడో, మాలో ఒకరు దిల్లీకి సీఎంగా ఉంటారు’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.