ఏపీలో నామినేటెడ్ పదవుల నియామకం
పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం విశాఖ జిల్లాలో ఇద్దరికి అవకాశం
అక్షరకిరణం (అమరావతి): ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మంగళవారం నామినేటెట్ పదవులను ప్రకటించింది. పలు కార్పొరేషన్లు, బోర్డులకు, చైైర్మన్లను నియమించింది.
వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అబ్దుల్ అజీజ్‌ను ప్రభుత్వం నియమించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్‌గా అనిమిని రవినాయుడు నియమితులయ్యారు.
ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్‌గా బత్తుల తాత్యబాబు, ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (ఏపీ ట్రైకార్ ) చర్మన్గా బొరగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్‌గా దామచర్ల సత్య నియమితులయ్యారు. ఎస్ఈ ఈపీ డీఏపీ (సీడాప్) (ఏపీలో ఉపాధి కల్పన ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ కోసం సొసైటీ) చైర్మన్‌గా దీపక్ రెడ్డి, 20 పాయింట్ ఫార్ములా చైర్మన్‌గా లంకా దినకర్ (బీజేపీ)ని ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా ఏపీ మార్క్‌ఫెడ్‌కు కర్రోతు బంగార్రాజును చైర్మన్‌గా నియమించారు. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా మన్నె సుబ్బారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరే షన్ ఏపీఐఐసీ చైర్మన్‌గా మంతెన రామరాజు, ఏపీ పద్మ శాలి సంక్షేమం, అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నందం అబద్ద య్య నియమితులయ్యారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చర్మన్గా నూకసాని బాలాజీ, 13 ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణ వైస్ చైర్మన్‌గా పీిఎస్ మునిరత్నం నియమితులయ్యారు. ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పీలా గోవింద సత్యనారాయణను నియమిం చారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పిల్లి మాణిక్యాలరావు, ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చర్మన్గా పీతల సుజాతను నియమించారు. ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఎంఈడీసీ) చైర్మన్‌గా తమ్మిరెడ్డి శివశంకర్(జనసేన) నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చర్మన్గా తోట మెహర్ సుధీర్ (జనసేన), ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీ) చైర్మన్‌గా వజ్జా బాబురావు, ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ ఏపీటీడ్కో చైర్మన్‌గా వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన) నియమితులయ్యారు.