ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు
అక్షరకిరణం, (విజయవాడ): ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వ హాయాంలో మద్యం విక్రయాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలపై కూటమి సర్కారు సిట్‌తో దర్యాప్తు చేయిస్తోంది. తాజాగా, మద్యం పాలసీ కేసులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడైన శ్రవణ్‌రావును సిట్ అధికారులు గురువారం విచారించారు. మద్యం కేసులో నిందితులకు, చాణక్యతోపాటు మరికొందరికి.. దుబాయ్‌లోని తన ఫ్లాట్‌లో శ్రవణ్ రావు ఆశ్రయం ఇచ్చారనే ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై విచారిం చేందుకు సిట్ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దీంతో శ్రవణ్ రావు విజయవాడలో సిట్ విచారణకు హాజర య్యారు. అంతేకాకుండా, నిందితుల్లో ఒకరైన రాజ్‌కెసిరెడ్డి తో శ్రవణ్‌రావుకున్న సంబంధాల గురించి కూడా ఆరా తీసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా శ్రవణ్‌రావు కీలక నిందితుడిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో భారీగా అవకతవకలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. లిక్కర్ కేసులో నిందితులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై సిట్ విచారణకు హాజరయ్యారు. ‘మద్యం కేసులో నిందితులైన చాణక్యతో పాటు మరికొందరికి దుబాయ్‌లోని తన ఫ్లాట్‌లో శ్రవణ్ రావు ఆశ్రయం కల్పించారనేది ప్రధాన అభియోగం’ అని సిట్ తెలిపింది. రాజ్‌కెసిరెడ్డితో శ్రవణ్‌రావుకున్న సంబంధాలపై కూడా సిట్ దృష్టి సారించింది. దీనిపై కూడా సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా, మద్యం పాలసీ కేసులో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మద్యం కేసులో నిందితుడైన చాణక్య మరో నలుగురికి ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు శ్రవణ్ రావు ఆశ్రయం ఇచ్చారనేది ఆరోపిణ. అయన ఫ్లాట్‌లోనే వారు ఉన్నారని సిట్ చెబుతోంది. కానీ, ఆ ఫ్లాట్‌ను డీలక్స్ హాలిడే హోమ్స్ అనే సంస్థకు లీజుకిచ్చినట్టు, అది ఎవరికి అద్దెకిచ్చిం దో తమకు తెలియదని శ్రవణ్‌రావు తరపున ఇచ్చిన ప్రకటన అవాస్తవమని గుర్తించింది. కింద శ్రవణ్‌రావే కొంతకాలం యజమాని కోటా కింద ఫ్లాట్ తీసుకుని, మద్యం కేసులో నిందితులకు ఇచ్చారని.. అంతేకాదు ఆయన వారితో కలిసి ఉన్నారని అధారాలు ఉన్నాయని చెబుతోంది.
మరోవైపు, మద్యం వ్యవహారం కేసులో అరెస్టైన వైసీపీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను ట్రయల్ కోర్టు గురువారం వాయిదా వేసింది. బెయిల్ కోసం ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోందని మిథున్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.