ఏసీబీ అధికారుల వలలో మల్కాపురం శాంతిభద్రతల విభాగం
ఎస్ఐ దేముడమ్మ
అక్షర కిరణం, (విశాఖపట్నం): అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అవినీతి తిమింగలం చిక్కింది. ఏసీబీ అధికారులు మల్కాపురం శాంతిభద్రతల విభాగం ఎస్ఐ కె.దేముడమ్మను లంచం తీసుకుంటుం డగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఓ చీటింగ్ కేసులో వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దేవుడమ్మ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుల నుండి ఎస్ఐ దేముడమ్మ రూ.50 వేలు డిమాండ్ చేశారని వారు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో దేముడమ్మ పది వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టు కున్నారు. ఇటీవల నూతనంగా నిర్మించిన ఇంట్లో గృహ ప్రవేశం చేసిన దేముడమ్మ పని తీరుపై పలువురు బాధితు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎస్ఐ దేముడమ్మను స్టేషన్‌లోని ఛాంబర్లో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.