దివ్యాంగుల విద్యలో ట్యాబ్‌ల వినియోగంపై సహిత విద్య రీసోర్స్పర్సన్లకు శిక్షణ
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ ఆర్కేబీచ్లో ఉన్న యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో దివ్యాంగుల విద్యలో ట్యాబ్‌ల వినియోగంపై సహిత విద్య రీసోర్స్ పర్సన్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి డీఈవో ఎల్.చంద్రకళ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు డిజిటల్ విద్యను అందించడంలో ప్రభుత్వం ప్రత్యే శ్రద్ధ చూపుతుందని తెలిపారు. సమగ్ర శిక్ష రాష్ట్ర సహిత విద్య విబాగం కన్సల్టెంట్ డాక్టర్ నరసింహం, సమన్వయకర్త డాక్టర్ ఎన్.అమ్మినాయుడు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు సమగ్ర శిక్ష ట్యాబ్‌లను పంపిణీ చేసిందన్నారు. ఈ ట్యాబ్‌లలో ప్రత్యేక ట్యాబ్‌లను అప్లోడ్ చేయడం వల్ల దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ శిక్షణను జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.గీత, ఏపీవో డి.అప్పలనాయుడు, పర్యవేక్షించారు. రీసోర్స్‌పర్సన్‌గా బి.మహాలక్ష్మినాయుడు, పి.సునీల్‌కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లాలోని సహిత విద్య రీసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.