53వ వార్డులో వీధి దీపాలు ఏర్పాటు
అక్షరకిరణం, (విశాఖపట్నం/మర్రిపాలెం): జీవీఎంసీ 53వ వార్డు మర్రిపాలెంలోని పలు వీధుల్లో గురువారం వీధి దీపాలను అమర్చారు. శ్రీరాంనగర్, నరేంద్రనగర్, శివనగర్ ప్రాంతాల్లో ప్రజల వినతుల మేరకు అధికారులు స్పందించారు. టీడీపీ విశాఖ జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు దృష్టికి ప్రజలు వీధి దీపాల సమస్యను తీసుకెళ్లారు. ఆయన దీనిపై తక్షణమే స్పందించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వీధి దీపాలు ఏర్పాటు చేయించారు. దీంతో విశాఖ జిల్లా పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస రావుకు ఆయా వార్డుల ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వార్డుల్లో ఇంకా ఏ వీధుల్లోనైనా విద్యుత్ దీపాల సమస్య ఉంటే తనకు తెలియజేయాలని కోరారు. సమస్యలను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు.