వేర్వేరు కేసుల్లో నిందితుల అరెస్టు
కఆరు తులాల బంగారం, రూ.50 వేలు రికవరీ
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): క్రైమ్ డీసీపీ లతా మాధురి ఆదేశాలతో ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు కేసుల్లో నలుగురు నింది తులను అరెస్టు చేసినట్టు క్రైమ్ ఏడీసీపీ మోహన్‌రావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన పలు వివరాలు వెల్లడిర చారు. చైతన్యనగర్‌లో ఉంటున్న ఒక వృద్ధురాలు(75) వరండాలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడ లోని బంగారం గొలుసు, చేతికున్న గాజులు అపహరించి పరారయ్యాడు. వాటిని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు గుర్తించి రికవరీ చేశామని తెలిపారు. అదేవిధం గా ఎంవీపీ సెక్టార్లో 90 ఏళ్ల వృద్ధురాలి నుంచి రెండు తులాల గొలుసు లాక్కొని పారిపోయాడు. ఎంవీపీ క్రైమ్ సీఐ చక్రధర్ రావు స్పందించి సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందిదులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని తెలి పారు. నిందితుల నుంచి ఆరు తులాల బంగారం, 50 వేల రూపాయలు రికవరీ చేశామని తెలిపారు. నిందితు లను పూర్తిగా విచారించి ఇంకా కొంతమొత్తం రికవరీ చేస్తామ ని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ అప్పలరాజు పాల్గొన్నారు.