విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల నిర్వహణకు ముహుర్తం ఖరారు
కప్రత్యేక దర్శానాలు రద్దు
అక్షర కిరణం, (విజయవాడ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు ముహుర్తం ఖరారు చేశారు. పది రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే వేడుకల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తారు. మొదటిరోజైన అక్టోబర్ 3వ తేదీన అమ్మ వారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. 4వ తేదీన గాయత్రీదేవిగా, 5వ తేదీన అన్నపూర్ణ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 6వ తేదీన లలితా త్రిపుర సుందరీదేవిగా, 7వ తేదీన మహాచండీ అలంకారంలో, 8వ తేదీన మహాలక్ష్మీ దేవిగా దర్శన మిస్తారు. 9వ తేదీన సరస్వతి దేవిగా దర్శనమిస్తారు. 10వ తేదీన దుర్గాదేవిగా, 11వ తేదీన న మహిషాసురమర్దినిగా, 12వ తేదీన రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు దర్శన మిస్తారు.
ప్రత్యేక దర్శనాల రద్దు..
దసరా ఉత్సవాల నేపథ్యంలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శ నాలను రద్దు చేస్తారు. గర్భగుడి దర్శనానికి అనుమతిం చరు. కేవలం ప్రోట్రోకాల్ కలిగిన వ్యక్తులకు మాత్రమే ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. సామాన్య భక్తులకు లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉండదు. కేవలం వృద్ధులు, ఆలయ సిబ్బం దికి లిఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కొండకింద నుంచి పైకి క్యూలైన్లో వెళ్లాల్సి ఉంటుంది. బస్సు మార్గంలో కొండపైకి సగం వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి నడక ద్వారా క్యూలైన్లోకి ప్రవేశించాలి. వీఐపీ వాహనాలను సైతం కొంతవరకు అనుమతిస్తారు. ప్రసాదం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను చేయనున్నారు.