స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన
అక్షర కిరణం, (విశాఖపట్నం): వైజాగ్ స్టీల్ ప్లాం ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్ సమా వేశం నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక రణకు వ్యతిరేకంగా ‘‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’’ పేరు తో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు, నల్ల వస్త్రాలు ధరించి జీవీఎంసీ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీటింగ్ హాలుకు వెళ్లి మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. స్టీల్‌ప్లాంట్ ప్రేవేటీకరణు అడ్డుకోవాలని నినాదాలు చేశారు.