ఆటోలో నగలు చోరీ: ఛేదించిన పోలీసులు
అక్షర కిరణం (విశాఖపట్నం సిటీ): ఆటోలో చోరీకి గురైన నగలను, నగదును తిరిగి బాధితులకు అప్పగిం చారు. ఈవివరాలను నేర విభాగం ఏసీపీ ఎ.వెంకట్రావు ఆదివారం పీఎం.పాలెం స్టేషన్లో వెల్లడిరచారు. పీఎం. పాలెం కారు షెడ్డు కూడలికి సమీపంలోని శరత్ సంకల్ప ప్యారడైజ్ అపార్టుమెంట్లో నివాసముంటున్న మాకిరెడ్డి సీతారామ లక్ష్మి(52) ఈనెల 6న ఆర్టీసీ డిపో వద్ద బస్సు దిగి ఆటో ఎక్కి ఆశీలుమెట్ట వద్ద దిగారు. ఈక్రమంలో ఆమె ప్రయా ణించిన ఆటోలో మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆపై ఆశీలుమెట్ట నుంచి కారు షెడ్డు వరకు మరో ఆటో ఎక్కి ఇంటికి చేరుకున్నారు. ఆపై బ్యాగ్ తెరచి చూస్తే ఆరున్నర తులాల బంగారు నగలు, రూ. 50 వేల నగదు కనిపించలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో బాధితురాలితో కలిసి ప్రయాణించిన అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తుడుమువీధికి చెందిన గాడి సత్యవతి(45) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఆమె నుంచి బంగారు నగలతోపాటు రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తర లించినట్లు ఏసీపీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తు వులు, నగదును బాధితురాలికి అప్పగించారు. కేసును త్వరి తగతిన ఛేదించిన పోలీసులను అభినందించారు. నేర విభాగం సీఐ బీఎస్ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.