వైభవంగా అయ్యప్ప అంబలం పూజ
అక్షర కిరణం (మాధవధార): మాధవధారలో అయ్యప్ప స్వామికి బుధవారం అంబలం పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వెలమ చెట్టు వీధి భవాని శంకర్ గురు స్వామి ఆధ్వర్యంలో పూర్ణ పుష్కలంబ అయ్యప్ప సేవా సంఘం స్వాముల సమక్షంలో అంబలం పూజ నిర్వహించారు. రంగురంగుల విద్యుద్దీపాలతో, పుష్పాలతో స్వామివారి మండపాన్ని అలంకరించారు. గురుస్వాములు భజనలతో ఆలయ ప్రాంగణమంతా పులకించి పోయింది. తదుపరి స్వామి వారికి ప్రత్యేక పూజలు, పడిపూజ, పల్లకీసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1000 మంది అయ్యప్ప స్వాములు, భవానీలు పాల్గొన్నారు. భక్తి గీతాలు, భజనలతో పూజ నిర్వహించారు.