మత్స్యకారుల జీవన ప్రమాణం మెరుగుకు ప్రభుత్వం కృషి
కమేయర్ గొలగాని
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): మత్స్యకారుల జీవన ప్రమాణం పెరిగేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నా యని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. గురువారం ఆమె నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లోని నోవాటెల్ హొటల్ వద్ద విశాఖ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ప్రతి ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్యకా రుల దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంద న్నారు. మత్స్యకారులు వారి జీవన ప్రమాణం పెరగాలని అందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణానికి పలు రాయితీలు ప్రభుత్వం కల్పిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదకరమైన జీవన విధానాన్ని కడుపుతున్నారని, వారికి సాంకేతికమైన పరిజ్ఞానాన్ని అందించి వారి ఉన్నతకి కృషి చేయాలన్నారు.