రైతు బజార్ ఏర్పాటుకు టీడీపీ నేతల స్థల పరిశీలన
అక్షరకిరణం, (పలాస/కాశీబుగ్గ): పలాస`కాశీబుగ ్గలో రతు బజార్ ఏర్పాటు కోసం టీడీపీ నాయకులు స్థలం పరిశీలించారు. ఈచుట్టు పక్కల ప్రాంతంలో ఉండే చిన్నకారు రైతులు పండిరచు కున్న కూరగాయలను అమ్ముకోవడానికి సరైన స్థలం లేక రోడ్లపైనే వాటిని అమ్ము కొంటున్నారు. దీనివల్ల ప్రజలకు ట్రాఫిక్పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈసమస్యకు శాశ్వత పరిష్కార దిశగా ఆదివారం పలాస - కాశీబుగ్గలో రైతు బజార్ కోసం టీడీపీ పలాస సమన్వయకర్త వెంకన్న చౌదరి స్థల పరిశీలన చేశారు. అనంతరం కాభీబుగ్గ బస్టాండ్ ఆవరణలో కాయగూరలు అమ్ముకుంటున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తీర్చుతామని హామీ ఇచ్చారు. త్వరలోనే రైతు బజార్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిరచారు. కార్యక్రమంలో యార్లగడ్డ వెంకన్న చౌదరి, పట్టణ ముఖ్య నాయకులు వజ్జ బాబురావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్, టాంకాల రవి తదితరులు పాల్గొన్నారు.