శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆత్మకూరి శంకర్రావు సేవలు అభినందనీయం
అక్షర కిరణం, (విశాఖపట్నం): శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆత్మకూరి శంకర్రావు 93వ జయంతి వేడుకలను విశాఖపట్నం నాయుడు తోటలో వున్న శంకర్ ఫౌండేషన్ ఐ ఆస్పత్రిలో సోమవారం నిర్వహించారు. ట్రస్టీ ఆత్మకూరి కృష్ణకుమార్, జీఎం కె రాధాకృష్ణన్, (అడ్మిన్, ఆపరేషన్స్) డిప్యూటీ జనరల్ మేనేజర్ కె.బంగా ర్రాజు, డాక్టర్లు శంకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శంకర్ ఫౌండేషన్ పురోభివృద్ధిలో నిత్యం సషమకిస్తున్న కార్పొరేట్ సంస్థల ప్రతినిధులైన నవీన్ మఖేజ, ఎండీ, సీఈఓ, సౌత్ ఆసియ ఎల్పీజీ కంపెనీ, అతుల్ కుమార్ శ్రీవాస్తవ, జనరల్ మేనేజర్, ఎల్, టి, ఎల్ఎస్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్, గేయిల్, ఎస్వీఎస్ ఎస్ఎన్ రాజు ఐనాక్స్, ఎన్ వెంకర రావు నెక్కేంటి సీ ఫుడ్స్ ఎండీ, డాక్టర్ రొక్కం రామ్మనోహర్ సైంటిస్ట్, కేశవ మజ్జి, బాజిలై ఫౌండేషన్ కార్యక్రమం లో పాల్గొని శంకర్ ఫౌండేషన్ అంధత్వ నివారణలో చేస్తున్న సేవలను కొని యాడారు. ఇకముందుకూడా శంకర్ ఫౌండేషన్ సేవలకు తమ సహకారం అందిస్తామన్నారు. సమాజ సేవ అబి óవృద్ధి భాగస్వాములైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా లకు చెందిన 230 మంది స్వచ్ఛంద సంస్థలు, విజన్ సెంటర్లకు చెందిన ప్రతినిధులు, శంకర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొ న్నారు. అత్యుత్తమ సమాజ సేవల అం దించిన వారికి శ్రీ కృష్ణకుమార్, రాధా కృష్ణన్, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు సత్కరించారు. కృష్ణకుమార్ తన తండ్రి దార్శనికత నిబద్ధతను గుర్తుచేసు కున్నారు. శంకర్ ఫౌండేషన్ ఇప్పటి వరకు 4,52,240 కంటి శస్త్రచికిత్సలు చేసి రికార్డు స్థాయిలో మైలురాయిని సాధించిందని తెలిపారు. కే రాధా కృష్ణన్, సభలో పాల్గొనేవారికి ఆస్పత్రిపై నమ్మకం ఉంచి పేదలకు సేవ చేయ డంలో నిబద్ధతను ప్రదర్శించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు డాక్టర్ టీ రవీంద్ర, ప్రొఫెసర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ నప్రిన్, డాక్టర్ శిరీష, డాక్టర్ కృష్ణ, డాక్టర్ సువర్ణ ఆస్పత్రిలోని అత్యాధునిక సదుపాయా లను వివరించారు.
డీజీఎం వి రమేష్ కుమార్ కార్యక్రమా న్ని నిర్వహించారు. సీనియర్ మేనేజర్ అప్పలరాజు స్వాగతం పలికారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ బంగార్ రాజు, డీజీఎం వేణు గోపాల్, ఏజీఎం కనకరాజు తదితరులు పాల్గొన్నారు.