నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ సీపీఐ డిమాండ్
అక్షరకిరణం, (పలాస): సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై 1 నుంచి 6వ తేదీ వరకు జరిగే ప్రచార, నిరసన కార్యక్రమా లకు సంబంధించి పోస్టర్ను సోమవారం సీపీఐ కార్యా లయంలో ఆవిష్కరించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్య వర్గసభ్యులు చాపర సుందర్లాల్ మాట్లాడుతూ రోజురోజు కు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియం త్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిం చారు. ధరలు నియంత్రణలో లేకపోవడంతో పేద, సామా న్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నార న్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనేకసార్లు పెంచి సామాన్య ప్రజలకు అవ స్థలకు గురి చేస్తోందన్నారు. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తు న్న అధికధరలను అరికట్టి, ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు లండ వెంకట్రావు, చాపర వేణుగోపాల్, గోరు వాసు, జబ్బకి పాల్గొన్నారు.