నిరుపేద కుటుంబానికి లయన్స్ క్లబ్ మహిళల చేయూత
అక్షరకిరణం, (పలాస): మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పలాస క్యాజుల్యాండ్ వనిత క్లబ్ సహకారంతో సింహాద్రి లక్ష్మీ పిల్లలకు చదువు నిమిత్తం రూ.5000 ఆర్థిక సహాయంతోపాటు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. లక్ష్మి భర్త అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్న విషయం తెలుసుకుని క్లబ్ సభ్యుల అండగా నిలిచారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తర్లానా శ్వేతకుమారి, కార్యదర్శి మల్లా సంతోషి, కోశాధికారి తూముల గాయత్రి, పూర్వ అధ్యక్షురాలు మల్లా జయశ్రీ పాల్గొన్నారు.