డాక్టర్ కుమార్ నాయక్‌కు ఉద్దాన బంధు అవార్డు
అక్షరకిరణం (వజ్రపుకొత్తూరు): డోకులపాడు గ్రామంలో ఆదివారం ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డాక్టర్ కుమార్‌నాయక్‌ను ‘ఉద్దాన బంధు’ అవార్డుతో సత్కరించారు. ఉద్దాన ప్రాంతంలో జానపదాలకు జీవం పోస్తూ, సాహితీ మిత్రులకు ప్రోత్సహిస్తూ, కళాకారులతో, కవుల తో, మమేకమై కళలను, కళాఖండాలను, కవులను, కళా సంపదను, పోషిస్తూ, ప్రోత్సహిస్తూ ఉద్దానతో అనుబంధం పెంచుకున్న కుమార్ నాయక్‌కు ఉద్దాన బంధు అవార్డు రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డోకులపాడు సర్పంచ్ వడ్డీ సరిత, కరుణకుమార్, వేదిక అధ్యక్ష, కార్యదర్శులు లండరుద్ర మూర్తి, కుత్తుమవినోద్, సిక్కోలు వేదిక అధ్యక్షులు రాపాక .ధనరాజు, సాహితీ వేత్త, వ్యాఖ్యాత బమ్మిడి. సుబ్బారావు, జన జాగృతి వ్యవస్థాపకులు తెప్పల. కృష్ణమూర్తి,,సాహితీవేత్తలు పువ్వల శివ జ్యోతి, వంకలరాజారావు, పాల్గొన్నారు.