రోడ్లపై పశువుల సంచారంతో అవస్థలు
కట్రాఫిక్కు ఇబ్బందులు కపట్టించుకోని అధికారులు
అక్షరకిరణం (పలాస/కాశీబుగ్గ): పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీలో పశువుల బెడద ఎక్కువగా ఉంది. పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంగా రోడ్లపైకి విడిచిపెట్టేస్తున్నారు. దీంతో ఇవి వాహనాలకు అడ్డంగా వస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నా యని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పశువులు రోడ్లపై అటుఇటూ సంచరిస్తూ వాహనాలకు అడ్డంగా వస్తుండడంతో ద్విచక్రవాహనాలను అదుపుచేయ లేక ప్రమాదాలు చోటుచేసుకుని వాహనదారులు తీవ్రంగా గాయపడిన సంఘటనలు చోటుచేసుకున్నాయని వాపో తున్నారు. పశువులు రోడ్లపై సంచరించకుండా చర్యలు తీసుకోవలసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం మానేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. దీని వల్ల రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు ప్రమాదా లు జరిగి ప్రాణాల మీదకు కూడా వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. పశువులను రోడ్లపై విచ్చలవిడిగా వదిలివేసే యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.