వైసీపీ శ్రేణులపై దాడులు ఆపకుంటే మహాధర్నా
వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
అక్షర కిరణం, (పలాస): వైసీపీ నేతలపై దాడులు ఆపకపోతే పలాసలో మహా ధర్నాకు పిలుపునిస్తాం అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైసీపీ నాయకులపై కత్తితో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే స్టేషన్ లోపలే టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నానని చెప్పారు. దాడి చేసిన నిందితులను చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తమ కార్యకర్తలను సహనం కోల్పోయినట్టు చేయవద్దని అలా చేస్తే తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గాయపడిన నాయకులను త్వరలోనే పరామర్శిస్తామని వారికి న్యాయం జరగకపోతే, పలాసలో వేలమంది వైసీపీ కార్యకర్తలతో మహాధర్నాకు పిలుపునిస్తామని జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు.