రాష్ట్ర ప్రజలకు కావలసింది విజన్ 24`29 కావాలి
కపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ విభాగం చైర్మన్ మూల వెంకటరావు
అక్షర కిరణం, (విశాఖపట్నం): రాష్ట్ర ప్రజలకు కావాల్సింది విజన్ 2047 కాదు.. 24 - 29 అని పీసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్ ఇంచార్జ్ మూల వెంకటరావు అన్నారు. ప్రభుత్వానికి స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలన్నారు. ఇప్పుడు ఆరు నెలల్లో టీసీఎస్, గూగుల్ వంటి ఒప్పందాలు చేసుకున్నారు. ప్రజలు గుర్తించేవి ఇలాంటి వాటినే నని పేర్కొన్నారు. 2047 నాటికి పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తామంటే ప్రజలు నమ్మరు. ఆ మాటకొస్తే పేదరికం లేని సమాజం ప్రపంచంలో లేదని చెప్పారు. సంపన్న దేశాలలో సైతం పేదరికం ఉంది.అక్కడ ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నాలుగున్నర సంవత్సరాల్లో ఏం చేస్తారో చెప్పాలి, ప్రభుత్వ ఆలోచనలు ఆ దశగా ఉండాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి విజన్ ఉన్న నాయకుడే... కాదనలేద న్నారు.. నాయకుడు అనేవారు ప్రజలను తనతో నడిపించ గలగాలి. ప్రజలను వదిలేసి వేగంగా ముందుకు పరిగెత్త కూడదు. సూపర్‌సిక్స్ అమలు చేసే దశగా ఉండాలి. తల్లికి వందనం లాంటి పథకం అమలు చేయాలి.ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్,కడప స్టీల్ ప్లాంట్ వంటివి రాష్ట్రానికి వచ్చేలా చూడాలి.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటికరణ ఆపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ప్రజలకు ఏం మేలు జరుగుతుందో వివరించి వారికి ఆ మేలు జరిగేలా చూడాలన్నారు. ప్రజలకు ఏం కావాలో ముందే తెలుసుకొని ప్రభుత్వ అధికారులకు దిశా నిర్దేశం చేస్తే చాలు.మీవంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రి ప్రజలకు ఇంకా మేలు చేయాలని కోరుకుంటున్నాం.మీ యొక్క విజన్ 24 - 29 మధ్య ఉండాలని రాష్ట్ర ప్రజల తరఫున కోరుతున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్ ఇంచార్జ్ మూల వెంకటరావు అన్నారు.