విశాఖ నగర వాతావరణ మార్పుకు ప్రత్యేక కార్యాచరణ
మేయర్ గొలగాని హరి వెంకట కుమారి
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ నగర వాతావరణం మార్పుపై జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని నగర మేయరు గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. మంగళవారం ఆమె జీవీఎంసీ ఆధ్వర్యంలో ఐసీ ఎల్ఈఐ ఆర్గనైజేషన్ క్లైమేట్ యాక్షన్‌పై రెసిలిఎన్ట్ సిటీస్ ప్లానింగ్, ఆచరణకు ఆంధ్రప్రదేశ్ లో 3 నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ ప్రాజెక్టుకు సంబంధించి ఏర్పాటు చేసిన వర్క్ షాప్‌లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. పరిస్థి తులు క్లైమేట్ చేంజ్ ప్రభావాల వల్ల మరింత తీవ్రంగా మారు తున్నాయని ప్రజల రక్షణ దిశగా విశాఖ నగర క్లైమేట్ చేంజ్ ను ఎదుర్కొనడానికి ప్రభుత్వం పలు అనుసరణ, నిరోధక చర్యలను తీసు కుంటోందన్నారు. విశాఖ నగరం ఇప్పటికే పునరుత్పాదక శక్తి వనరుల వినియోగంలో ముందంజలో ఉందన్నారు. జీవీఎంసీ 13 మెగావాట్ల సోలార్ శక్తి గరిష్ట సామర్థ్యం కలిగిన ప్లాంట్లను నీటిపై, భూమిపై రూఫ్‌టాప్‌లపై ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీతో నగరానికి కావలసిన అవసరాల ను సమకూర్చుకుంటోందన్నారు. జీవీఎంసీ బీచ్ రోడ్లో 3,000 సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసిందన్నారు. విశాఖపట్నంలో 28శాతం గ్రీన్ కవర్ ఉందని మరింత పచ్చదనం ప్రజల సహకారంతో పెంపొందించేదుకు చర్య లు జీవీఎంసీ చేపడుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనే నగరాల భాగస్వాములను క్లైమేట్ చేంజ్‌పై తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.
అనంతరం విశాఖపట్నం క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లాన్ ను జీవీఎంసీ ఎస్ఆరయు టీమ్ పీపీటీతో వివరించారు.
జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ ఆర్.సోమనారాయణ, ప్రధాన ఇంజనీర్ పి.శివప్రసాద్ రాజు, ఆర్గనైజేషన్ ప్రతినిధి ఈమని కుమార్, ప్రొఫెసర్ ఎస్.రామకృష్ణారావు, విజయ వాడ అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు క్లైమేట్ చేంజ్ యాక్షన్ ప్లానింగ్ చర్చలలో పలు అంశాలపై చర్చించారు.
వర్క్ షాప్‌లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ డి.చంద్రశేఖరరావు, మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ వారా రవీంద్ర, శ్రీకాకుళం కమిషనర్ ప్రసాదరావు, విజయనగరం మున్సిపల్ కమిషనర్ పీ. నల్లనయ్య, కాకినాడ కార్యనిర్వాహక ఇంజనీర్ మత్స్యరాజు, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీర్ సంపత్ కుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఏడుకొండలు, రత్నాకర్ రెడ్డి, జీవీఎంసీ కార్యదర్శి బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.