విశాఖ జిల్లా రాపిడ్, బ్లిట్జ్-2025 చదరంగం పోటీలు
అక్షర కిరణం (మాధవధార): విశాఖ జిల్లా రాపిడ్, బ్లిట్జ్-2025 చదరంగం సెలక్షన్స్ తుది పోటీలు మంగళవారం చాణిక్య డిగ్రీ కాలేజ్‌లో నిర్వహించారు. ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ తరుపున చైతన్య చెస్ అకాడమీ ఆర్గనైజర్‌గా ఈ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏవీసీఏ ప్రెసిడెంట్ డాక్టర్ రంగాల బాబురావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చెస్‌లో ఓపెనింగ్ గేమ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్, తెలుసుకొని దానిపై ఆటలో పట్టు సాధించాలన్నారు. కాగా రాపిడ్ కోసం 28 రేటెడ్ ప్లేయర్స్ మొత్తం 98 మంది, బ్లిట్జ్ కోసం 27 రేటెడ్ ప్లేయర్స్ మొత్తం 93 మంది పాల్గొన్నారు. పోటీల్లో గెలిచిన మొదటి ఇద్దరు క్రీడాకారులు సెప్టెంబర్ 13 ,14 తేదీల్లో నంద్యాల్ జిల్లాలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాపిడ్, బ్లిట్జ్-2025 చాంపియన్‌షిప్ పాల్గొంటారని తెలిపారు.
రాపిడ్ పోటీల్లో కృష్ణ వరన్య పోటునూరు మొదటి స్థానంలో నిలిచారు. చంద్రశేఖర్ రెండవ స్థానం, గెలుచుకున్నారు. బ్లిట్జ్ పోటీల్లో చంద్రశేఖర్ మొదటి స్థానం, ప్రశాంత్ కె రెండవ స్థానం సాధించారు. విజేతలకు అతిధులు నగదు బహుమతులు, ట్రోఫీలు సర్టిఫికెట్లు అందజేశారు.