సీపీఐ శత వార్షికోత్సవ జెండా ఆవిష్కరణ
అక్షరకిరణం, (పలాస): పేదల పక్షాన నిలిచేది సీపీఐ అని ఆ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చాపర వేణు అన్నారు. సీపీఐ శతవార్షికోత్సవ జెండాను కాశీబుగ్గ మెయిన్ రోడ్లో పార్టీ శాఖ కార్యదర్శి సుందర్రావు, నియోజక కార్యదర్శి చాపర వేణు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ 26, 1925 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో స్థాపించారన్నారు. కమ్యూనిస్టు పార్టీ నిర్బంధంలో పుట్టి పెరిగిన పార్టీ అన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం కోసం పిలుపునిచ్చిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి, సీపీఐ నాయకులు ముకుందరావు, మున్నా, స్వామి,చిన్న, గుణశేఖర, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.