తెలంగాణ సీఎం రెవంత్రెడ్డితో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): ఢల్లీిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాబినెట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళ వారం కలిశారు. ఈసందర్భంగా తెలంగాణలో విమానా శ్రయ అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి విమానాశ్రయానికి కావలసిన భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిన వెంటనే త్వరితగతిన వరంగల్ విమానాశ్రయ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి-రామగుండం, ఆదిలాబాద్లో విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలను పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్తామని రామ్మోహన్ నాయుడు ఈసందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పౌర విమానయాన శాఖ తరపున పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.