పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
అక్షర కిరణం, (పెందుర్తి): పెందుర్తి మండలం జీవీ ఎంసీ 96వ వార్డు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జాతికి అంకితం చేస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో వర్చువల్ పద్ధతిలో పాఠశాలను అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. వీరితోపాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్ బి విజయభాస్కర్, సమగ్ర శిక్షణ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప్రేమ్‌కుమార్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సోమేశ్వరరావు, ఏఎంలో లక్ష్మీ, మండల రెవెన్యూ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సువర్ణ, మధు మూర్తి, పెందుర్తి పీఎంశ్రీ ప్రభుత్వం ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ సీహెచ్ చిన్మయ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గొర్లి రామునాయుడు, వార్డు అధ్యక్షులు డీబీఎల్ నాయుడు, సేనాపతి సోమశేఖర్, పిన్నింటి పార్వతి, హాస్పిటల్ మెంబర్స్ రాపర్తి నందు, వరూధిని, రాపర్తి కిషోర్, రాపర్తి కృష్ణమోహన్, ఊరికుటి లక్కీ, గోవింద్, బంటు సురేష్, తనకాల శ్రీనివాసరావు, రమేష్, అంబటి వెంకటేశ్వరరావు తదితర పాఠశాల సిబ్బంది, పెందుర్తి మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.