ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్టు
క9 వాహనాలు స్వాధీనం
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): నగరంలో పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీచేసే ముఠాని పోలీసు లు అదుపులోకి తీసుకున్నారు. రూ.20 లక్షల విలువచేసే 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబం ధించిన వివరాలను ఏసీపీ వెంకటరావు విలేఖరుల సమా వేశంలో వెల్లడిరచారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పాల లీలాదుర్గాప్రసాద్(22) విశాఖలో చదువు కున్నాడు. తర్వాత సొంత జిల్లాకు వెళ్లిపోయాడు. అతని స్నేహితులతో కలిసి వ్యాపారం చేయాలని అనుకున్నాడు. అయితే ఓ కేసు విషయంలో వ్యాపారానికి పెట్టాలనుకున్న డబ్బులు ఖర్చయి పోయాయి. దీంతో నలుగురు స్నేహితులు కలిసి చోరీలకు పాల్పడడం ప్రారంభించారు. దుర్గాప్రసాద్ విశాఖలో చదు వుకొని ఉండడంతో ఇక్కడకు వచ్చి వాహనాలు చోరీ చేస్తు న్నాడు. ఆరు నెలలుగా రూ. 20 లక్షలు విలువైన 9 ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. ఇటీవల వాహనం పోగొట్టుకున్న ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిఘా పెట్టి నిందితులను గుర్తించారు. దుర్గాప్రసాద్‌తోపాటు కడలి సాయిసూర్య(19), సాహిక్ ముస్తఫా(22)లను పశ్చిమ గోదావరి జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. మరో నింది తుడు హరీష్‌ను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. సమావేశంలో ఏసీపీ వెంకటరావు రావు, ఏడీసీపీ మోహన్, సిబ్బంది పాల్గొన్నారు.
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
కరాష్ట్ర ఫిజీషియన్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాంబాబు
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): వైద్య రంగాన్ని ఆధునిక దిశగా మార్పులు చేస్తూ ప్రసంగాలు వినిపిం చారు. గత మూడు రోజులుగా వుడా చిల్డ్రన్ థియేటర్లో ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు వెయ్యి మంది వైద్యుల సౌత్ జోన్, సౌత్ మిడ్ జోన్ సదస్సులోవిప్లవాత్మక మార్పుల కోసం ప్రసంగించారు. కొవిడ్ తరహా ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేసేందుకు వైద్యులందరూ సిద్ధంగా ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అవసర మైన సహాయ, సహకారాలు అందిస్తామని రాష్ట్ర ఫిజీషి యన్ల సంఘం అధ్యక్షుడు, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు పేర్కొన్నారు. ముగింపు సందర్భంగా ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. ‘సదస్సుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 67 మంది వైద్య నిపుణులు హాజరై వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు, వారి అనుభవాలు, విశ్లేషణలపై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ వైద్య పరిరక్షణ కమిటీ సభ్యు లు డాక్టర్ నాగేశ్వరరెడ్డి, డాక్టర్ షాకీర్ హుస్సేన్, ఈ డాక్టర్ సతీష్‌చంద్ర తదితరులు పాల్గొని వైద్యులకు సూచనలు ఇచ్చారు. ప్రమాదకర పరిస్థితుల్లో రోగిని ఆసుపత్రికి తీసు కొస్తే తొలి గంటలో అందించాల్సిన చికిత్స తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సదస్సులో చర్చించిన కీలక అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తామని తెలి పారు. సదస్సుకు ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్, పుదుచ్చేరికి చెందిన 1200 మంది వైద్యులు, వైద్య విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.