ఆటో డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమం
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం సిటీలో గల 4200 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి 16 బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చీ తెలిపారు. ఇప్పటివరకు 14 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చా మన్నారు. మంగళవారం పోలీస్ బ్యారెక్స్‌లోని టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ హాల్లో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో 15వ బ్యాచ్ ఆటో డ్రైవర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇటీవల నగరంలో సీసీ ఫుటేజ్లలో రికార్డ్ అయిన ప్రమాదాలను వివరించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను, డిఫెన్స్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్ ఆవశ్యకత, వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయడం తదితర అంశాలను వివరించారు. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ ముఖ్యఅతిథిóగా విచ్చేసి, శిక్షణకు హాజరైనా ఆటోడ్రైవర్లతో మాట్లాడుతూ త్వరలో దాతల సహాయంతో నగరంలోని ఆటో డ్రైవర్లకు బ్యాడ్జి పేరులతో రెండు జతల యూనిఫామ్ అందజేస్తామని, ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తామని, పోలీసులు, ఆటోడ్రైవర్ మధ్య మంచి సంబంధాలు ఉండాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న ఆటోడ్రైవర్లను గుర్తించి వారికీ టీ షర్టులు, క్యాప్‌లను అందజేశారు. కారక్రమంలో శిక్షకులు, సుమారు 250 మంది ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ ఏడీసీపీ, ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.