హెల్మెట్ ధారణపై ట్రాఫిక్ సీఐ అవగాహన
అక్షర కిరణం (కంచరపాలెం): మర్రిపాలెం రోడ్డు లో మంగళవారం హెల్మెట్ వినియోగించని ద్విచక్ర వాహన దారులకు ట్రాఫిక్ సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేసే ఇద్దరు కూడా హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం అని స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ విషయం మీద చాలా కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అలాగే త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్తోపాటు ఇతర వయెలేషన్స్ మీద కూడా కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. వాహనం నడిపే వారి వద్ద డ్రైవింగ్ లైసెన్సు వాహనం పత్రాలు కచ్చితంగా ఉండా లని కంచరపాలెం ఎయిర్పోర్ట్ ఏరియాలో ఈడ్రైవ్ ము మ్మరంగా కొనసాగుతున్నట్లు ట్రాఫిక్ సీఐ ఆరంగి దాశరథి తెలిపారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.