జలపాతంలో ముగ్గురు వైద్య విద్యార్థులు గల్లంతు
అక్షర కిరణం, (మారేడుమిల్లి): ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిని జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. చదువులతో నిమగ్న మైన విద్యార్థులు ప్రకృతి ఒడిలో గడపాలని విహారయాత్రకు వచ్చారు. ఉత్సాహంగా అక్కడి జలపాతంలో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహించి అయిదుగురు కొట్టుకు పోయారు. వీరిలో ఇద్దరిని అక్కడున్నవారు కాపాడగా.. ముగ్గురు గల్లంతయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితు లు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ట్రావ ెలర్ వాహనంలో ఆదివారం వచ్చారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జల తరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు.
ఈక్రమంలో ఎగువ ప్రాంతంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. ఈ వర్షంతో జలపాతం ఉద్ధృతి పెరగడంతో అయిదుగురు కొట్టుకుపోయారు. అందులో విజయనగరా నికి చెందిన హరిణిప్రియ, గాయత్రి పుష్ప అనే ఇద్దరిని ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించా రు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజ మహేంద్రవరం తరలించారు. గల్లంతైన వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సీహెచ్.హరదీప్ (20), విజయనగరానికి చెందిన కొసిరెడ్డి సౌమ్య(21), బాపట్లకు చెందిన బి.అమృత(21) ఉన్నారు. పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన కొసిరెడ్డి సౌమ్య స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం రావువారి వీధి. కుమార్తె గల్లంతైన సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అప్పలనాయుడు, రమ ఆందోళనతో వాగు వద్దకు పయనమయ్యారు.