మైసూరు సింహాసనం సిద్ధమైంది
మైసూరు దసరా ఉత్సవాల షెడ్యూల్ విడుదల
అక్షరకిరణం, (బెంగళూరు/జాతీయం): ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యా సాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శన మిస్తున్నాయి. ప్యాలెస్ సంప్రదాయంలో భాగంగా శుక్ర వారం బంగారు వజ్రఖచిత సింహాసనం అమరిక జరిగింది. తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు కొనసాగాయి. లాకర్లలో భద్రపరిచిన విడిభాగాలను జిల్లా అధికారుల సమక్షంలో బయటకు తీసుకొచ్చారు. 7.30 గంటలకు నవగ్రహ, శాంతి హోమాలు జరిగాయి. 9.55 గంటలకు దర్బార్ హాల్లో సింహాసనాన్ని అమర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రాజమాత ప్రమోదాదేవి ఒడెయార్, ప్యాలెస్ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
3 నుంచి దసరా ఉత్సవాలు..
అక్టోబరు 3నుంచి శరన్నవ నవరాత్రులు ప్రారంభం కాను న్నాయి. ఉదయం పూజలతో శ్రీకారం చుడతారు. తెల్లవారు జామున 5.45 గంటలకు రత్నఖచిత సింహాసనానికి ముఖం అమర్చే ప్రక్రియ చేపడతారు. ప్యాలెస్?లో యదు వంశరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్‌కు కంకణధారణ చేయనున్నారు. 10.30 గంటలకు పట్టపు టేనుగు, ప్యాలెస్ గుర్రాలు, ఆవులకు పూజలు చేస్తారు. 12 గంటలకు సింహాసనంపై యువరాజు ఆశీనులు కావడం ద్వారా ప్రైవేట్ దర్బార్ ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 1గంటకు కులదేవత చాముండేశ్వరిదేవి మూర్తిని ఊయల్లో ఉంచి ప్యాలెస్‌టో ఉత్సవాలు ప్రారంభి స్తారు. 4న పారంపార్య మోటర్‌బైక్ ర్యాలీ జరుగుతుంది. అక్టోబరు 9న బుధవారం ఉదయం 10 గంటలకు సర స్వతి పూజ చేస్తారు. 10న రాత్రి ప్రైవేట్ దర్బార్ ముగియ నుంది. 11న దుర్గాష్టమి జరగనుంది. ప్రతిరోజూ ప్యాలెస్ లోపల రాజసంప్రదాయంగా పూజలు, కార్యక్రమాలు కొనసాగి, ప్రభుత్వ కార్యక్రమాలు నిరంతరంగా ఉంటాయి.