అప్పుల బాధతో వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
అక్షర కిరణం, (పొందూరు):: వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధతో పొందూరు పట్టణానికి చెందిన వస్ట్రవ్యాపారి ఉండ్రాళ్ళ కిశోర్(50) ఆత్మహత్యకు పాల్ప డ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఉండ్రాళ్ల కిశోర్ (50) వ్యాపారం కోసం బ్యాంకు లో రుణం తీసుకోవడంతో పాటు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. అయితే వ్యాపారం మంద గించడంతో వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. దీంతో రుణదాతలు తీవ్ర ఒత్తిడి తేవడంతోపాటు ఇటీవల ఇంటికి వచ్చి కిశోర్‌పై భౌతికంగా దాడి చేశారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కాగా తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ ఒత్తిడి ఎక్కువ కావడంతో కిశోర్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉత్సాహంగా కనిపించిన కిశోర్ రాత్రి 8 గంటల సమయంలో ఆలయంలో ఉన్న భార్యకు దుకాణం తాళాలు అప్పగించి బయటకు వెళుతు న్నానని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్టు సమా చారం. స్నేహితుడి ద్విచక్ర వాహనంపై వెళ్లిన కిశోర్ ఎంతకీ రాకపోవడంతో అర్ధరాత్రి వరకు వెతికినా ప్రయోజనం లేక పోయింది. బుధవారం ఉదయం ధర్మపురం గ్రామం నుం చి బావిలో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని కిశోర్గిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కిశోర్ కుటుంబ సభ్యులు అతని మరణవార్త విని కుప్పకూలిపోయారు. పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రీమ్స్‌కు తరలించారు. మృతునికి భార్య అనూష, కుమార్తె, కుమారుడు ఉన్నారు.