ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ
కమే 2న అమరావతికి పీఎం మోదీ
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఈమేరకు పీఎంవో షెడ్యూల్ను ఖరారు చేసింది. ప్రధాని ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవంలో పాల్గొంటారు. నరేంద్ర మోదీ మే 2న ఢల్లీి నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి అమరావతికి చేరుకుని.. సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది ప్రభుత్వం.
ప్రధాని మోదీ హాజరయ్యే అమరావతి పనుల శంకుస్థాపన కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. అమరావతి సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఇప్పటికే ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనులు పునః ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి, బహిరంగ సభకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా నియమించగా.. ఎస్పీజీ బృందం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
మరోవైపు అమరావతి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి నోడల్ అధికారిగా వీరపాండ్యన్ ఉన్నారు.. ఈ మేరకు సీఎస్ విజయానంద్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రోడ్లను గుర్తించారు. ఆయా రోడ్లపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలను ప్రారంభించాలని నిర్ణయించింది.. ఈ మేరకు ఇప్పటికే కొన్ని టెండర్లను కూడా ఖరారు చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పనుల్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తే బావుటుందని ఆలోచించారు. ఇటీవల ఢల్లీికి వెళ్లిన చంద్రబాబు అమరావతి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రధానిని కోరారు.. మోదీ సానుకూలంగా స్పందించడంతో షెడ్యూల్ ఖరారైంది.