పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత
బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయాలు
రాహుల్ గాంధీ నెట్టేశారంటూ బీజేపీ ఆరోపణలు
అక్షర కిరణం, (ఢల్లీి/జాతీయం): పార్లమెంట్ వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం చోటు చేసు కుంది. హోంమంత్రి అమిత్ షా.. రాజ్యాంగ నిర్మాత అంబే డ్కర్‌పై చేసిన వ్యాఖ్యలు తప్పంటూ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. మరోవైపు బీజేపీ కూడా.. కాంగ్రెస్ అంబేడ్కర్‌ను అవమానించిందంటూ ధర్నా చేసింది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలు పార్లమెంట్ వద్ద నిరసనలు చేపట్టాయి. అయితే కొందరు నేతలు పార్లమెంటులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఒకరినొకరు అడ్డగించుకున్నారు. ఈక్రమం లోనే ఒడిశాకు చెందిన ఓ బీజేపీ ఎంపీ కిందపడిపోగా.. ఆయన తలకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం పార్లమెంట్ బయట ప్రతిపక్షాలతో పాటు అధికార పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ నిరసన చేపట్టాయి. ఈ క్రమంలోనే కొందరు ఎంపీలు పార్లమెంటు లోపలికి వెళ్లేం దుకు ప్రయత్నించారు. కానీ పలువురు నేతలు అడ్డుకోవ డంతో గొడవ ప్రారంభం అయింది. ముఖ్యంగా కొందరు నేతలు ఒకరినొకరు నెట్టేసుకోవడంతో.. ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్ల పైనుంచి కింద పడిపోయారు. దీంతో ఆయన తలకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. ఇది గుర్తించిన నేతలు ఆయనను ఓ చోట కూర్చోబెట్టి... చికిత్స చేయించారు.
గాయపడిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి.. తనను రాహుల్ గాంధీ కింద నెట్టేశారంటూ ఆరోపణలు చేశారు. తాను మెట్లపై నిల్చుని ఉండగా... రాహుల్ గాంధీ ఓ ఎంపీని కిందకు నెట్టారని, ఆయన వచ్చి తనని తగలడంతో తాను కింద పడిపోయిట్లు పేర్కొన్నారు. దీంతో బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలని బీజేపీ యంత్రాంగం ఆలోచిస్తుందని సమాచారం.
దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. తాను ఎవరినీ నెట్టలేదని, తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలే తమను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నట్లు చెప్పారు. తనతో పాటు మల్లికార్జున్ ఖర్గేను కూడా అఢ్డుకున్నారని.. వాళ్లే ముందుగా కాంగ్రెస్ నేతలను కిందకు తోసేశారని పరస్పర ఆరోపణ చేశారు. అయితే ఇదంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డు కూడా అయిందని వెల్లడిరచారు. ఈ గొడవల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా వేశారు.