వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించండి
కజీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్ స్టేగ్ హోల్డర్లకు అవగాహన సదస్సు
అక్షర కిరణం, (విశాఖపట్నం): వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా నగర ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్టేగ్ హోల్డర్స్ తో సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా నగర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, జీవీఎంసీ నగరంలో పలుచోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అలాగే నివాస సంక్షేమ సంఘం సభ్యులు, ఎన్జీవోస్, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు కు ముందుకు వస్తున్నారని, వారికి జీవీఎంసీ సహాకారం అందిస్తుందని, వారు కోరితే తాగునీరు అందిస్తామని తెలిపారు. వేసవిలో మధ్యాహ్నం వృద్ధులు పిల్లలు తప్పని పరిస్థితిలో తప్ప బయట తిరగరాదని వదులు గా వున్న తెలుపు రంగు కాటన్ దుస్తులు దరిస్తే మంచిదని సూచిం చారు. జీవీఎంసీ వేసవిలో తీసుకోవలసిన చర్యలు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగు తుందని, అలాగే స్టేగ్ హోల్డర్స్ కూడా సాధ్యమైనంత వరకు అవగా హన కార్యక్రమంలో పాల్గొని వేసవిలో తీసుకోవలసిన జాగ్ర త్తలపై అవగాహన ప్రజలకు కల్పించాలని సూచించారు. అనంతరం స్టేగ్ హోల్డర్స్ ప్రతినిధులు వారు చేపట్టే కార్యక్ర మాలతోపాటు పలు సూచనలను అధికారులకు వివరించారు. కార్యక్రమంలో జివిఎంసి పర్యవేక్షక ఇంజనీరు రాజేంద్ర కృష్ణ, జోనల్ కమిషనర్లు మల్లయ్య నాయుడు, శివప్రసాద్, ఏఎమ్ఓహెచ్లు డాక్టర్ కిషోర్, సునీల్, డాక్టర్ అప్పల నాయుడు, బి.ప్రసాదరావు, కిరణ్, ఎస్ఆర్యు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.