కాణిపాకం ఆలయం ప్రధాన అర్చకుడి సస్పెన్షన్
అక్షర కిరణం, (ఐరాల(కాణిపాకం): ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్ గురుకుల ్ను సస్పెండ్ చేసినట్లు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ తెలిపారు. తన పదోన్నతి కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలను ఆలయానికి సమర్పించారంటూ సోమశేఖర్ గురుకుల్‌పై లాయర్ రవికుమార్ ఆరునెలల కిందట దేవదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
దీంతో అప్పటి ఈవో వెంకటేశుకు తప్పుడు ధ్రువపత్రాల విషయాన్ని పరిశీలించి నివేదికను అందించాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఆలయంలో దేవదాయ శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా ఆయన ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు తప్పుడు పత్రాలని తేలింది. అయితే సోమశేఖర్ గురుకుల్కు అప్పటి ఆలయ ధర్మకర్తల మండలి అండ ఉండడంతో ఈవో ఏం చేయలేకపోయారు.
ఈ విషయంపై లాయర్ రవికుమార్ కోర్టులో దావా వేశారు. ఈనేపథ్యంలో ఈవోగా వచ్చిన గురుప్రసాద్ దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు నెల కిందట ధ్రువీకరణ పత్రాలపై నివేదిక పంపించారు. దీంతో ఆలయ ప్రధాన అర్చకుడు సోమశేఖర్గురుకుల్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆలయ ఇన్చార్జి ప్రధాన అర్చకుడిగా ఎస్.ఎస్. గణేష్ గురుకుల్‌ను నియమిస్తూ దేవదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.