విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం
కవిశాఖను ఐటీ కేంద్రంగా మారుస్తాం
కచర్చే లేని అంశంపై వైసీపీ దుష్ప్రచారం
తిరుమల లడ్డుపై సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి
విశాఖలో సీఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సు అనంతరం మీడియాతో మంత్రి లోకేష్
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణపై అసలు చర్చేలేదని.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొ న్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వబోమని స్పష్టం చేశారు. విశాఖ నోవాటెల్‌లో సీఐఐ ఇన్ ఫ్ర్రాస్ట్రక్టర్ సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, ఫైనాన్షియర్స్, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమ్మిట్ ఏర్పాటు చేసుకోన్నారన్నారు. విశాఖకు ఏం చేయాలి, మౌలి క సదుపాయాల ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించింద న్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో స్పీడ్ బ్రేకర్లా ఆగిపోయాయి. వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనే అంశా లపై కూడా చర్చించామన్నారు. గత వైసీపీ పాలనలో వెనుక బడిన ఏపీని ముందుకు తీసుకెళ్తాం అన్నారు. ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైజ్ చేయాలి, ఏపీని మళ్లీ ముందుకు తీసుకుళ్లేందుకు సమ్మిట్‌లో చర్చిస్తున్నామన్నారు. 20లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం, ఎవరెక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అందుకు తగ్గట్లుగా రాయితీలు కల్పిస్తామ మన్నారు.
విశాఖను ఐటీ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతాం
గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో ఒప్పందాలు కుదు ర్చుకున్నాం. గత ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్నారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున విశాఖలో పెట్టుబడులు రాబోతున్నాయ న్నారు. విశాఖను ఇతర రాష్ట్రాలతో పోటీపడేవిధంగా చేస్తామ న్నారు. నిరుద్యోగ యువతకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలతో సమావేశమై వారికున్న సమస్యలపై చర్చించామన్నారు. వచ్చే ఐదేళ్లలో 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కొంత మంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారని, ఫీల్డ్ విజిట్స్‌కి కూడా వెళ్తున్నామన్నారు.
రాబోయే వంద రోజుల్లో ఐటీ పాలసీ తీసుకువస్తాం..
రాబోయే వంద రోజుల్లో ఐటీ, జీసీసీ పాలసీ తీసుకువస్తా మన్నారు. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఐటీ పెట్టుబడులు తీసుకువస్తామన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై దృష్టిసారిస్తు న్నామన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామ న్నారు. గతంలో ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామ న్నారు. దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. భూమి కూడా ఇచ్చి శంకుస్థాపన కూడా చేశా మన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నీరుగారిపోయిందని, వారందరితో సమావేశమై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
విశాఖ ఉక్కుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది..
ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకం గా తాము మాట్లాడామన్నారు. గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదన్నారు. వారికి కావాల్సిన రాయితీ లు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై చర్చే లేదు. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వబోమని తమ అధ్యక్షులు పల్లా శ్రీని వాసరావు స్పష్టంగా చెప్పారన్నారు. కేంద్రం ఇటీవల రూ.500 కోట్ల గ్రాండ్ కూడా ఇచ్చిందన్నారు.
లడ్డూపై సిట్ దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయి
తిరుమల లడ్డూపై ప్రమాణానికి తాను సిద్ధమని సవాల్ చేస్తే.. వైవీ సుబ్బారెడ్డి పారిపోయారన్నారు. నెయ్యిని మార్కెట్ ధర కంటే 40శాతం తక్కువ ధరకు ఇచ్చారు. సిట్ లో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. వైసీపీ కప్పిపుచ్చుకోవ డానికి ప్రయత్నిస్తోందని, రాజకీయాలు కాదు కావాల్సిందని నారా లోకేష్ అన్నారు.