ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా సీర రాము
అక్షర కిరణం, (పొందూరు): పొందూరు జి సిగడాం మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీర రాము, రేగిడి సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పొందూరు పట్టణంలో మంగళవారం జరిగిన ఎన్నికలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్స్సీ, ఎస్టీల సంక్షేమమే తమన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని తెలిపారు.