60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్‌పై రౌడీషీట్
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పీవీ సురేష్‌పై మల్కాపురం పోలీసులు రౌడీషీట్ తెరిచారు. వైసీపీ తరుపున ఆయన కార్పొరేటర్‌గా గెలిచిన విషయం తెలిసిందే. వైసీపీ నాయకులతో గతంలో విభేదా లేర్పడ్డాయి. అంతేకాకుండా ఓ చిరు దుకాణదారుడి పైనా జీవీఎంసీ సిబ్బందితో కలసి సురేష్ చిందులేశారు. సురేష్ వ్యవహారాలపై అనేక విమర్శలు రావడంతో వైసీపీ అధిష్టానం ఆయనను సస్పెండ్ చేసింది. బయట వ్యక్తుల తోను ఆయన దుర్భాషలాడడం, దాడికి పాల్పడడంతో అనే క కేసులు నమోదయ్యాయి. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతో కార్పొరేటర్ పీవీ సురేష్‌పై రౌడీషీట్ తెరచినట్టు పోలీసులు తెలిపారు.