జీవీఎంసీ జోన్`8 కార్యాలయంలో వార్డులోని సమస్యలపై సమీక్ష
అక్షర కిరణం, (పెందుర్తి): జీవీఎంసీ జోన్-8 జోనల్ ఆఫీసు సమావేశ మందిరంలో జీవీఎంసీ 93 నుండి 98వ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలపై జీవీఎంసీ ఉన్నతాధికారులతో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. జోనల్ ఆఫీసును నూతనంగా మరమ్మత్తులు చేసిన మొదటిసారి గా జోనల్ ఆఫీస్‌లోకి వచ్చి జోనల్ ఆఫీస్ పరిసర ప్రాంతా లను పరిశీలించారు. పంచకర్ల రమేష్‌బాబుతోపాటు జీవీఎంసీ జోనల్ కమిషనర్ హైమావతి, టీడీపీ నాయ కులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 96వ, 97, 94, 93 వార్డ్ కార్పొరేటర్లు పీలా శ్రీనివాసరావు, వసంత శంకర్రావు, బల్ల శ్రీనివాసరావు, రాపర్తి కన్నా, 95వ, 96, 97వ వార్డు అధ్యక్షులు దాట్ల మధు, కంచిపాటి మధు, డీబీఎల్ నాయుడు, సేనాపతి సోమశేఖర్, 93వ వార్డు అధ్యక్షులు ఆదిబాబు, 94వ వార్డు అధ్యక్షులు పెన్నింటి పార్వతి, 98వ వార్డు అధ్యక్షులు మజ్జి సూరిబాబు జీవీఎంసీ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.