రైతు సమస్యలను పరిష్కరించాలంటూ వీఎంఆర్డీఏ కమిషనర్‌కు వినతి
అక్షర కిరణం, (పెందుర్తి): పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డ్ వేపగుంట గ్రామం ప్రజలు ప్రధానం గా ఎదుర్కొంటున్న వుడా భూములు, రైతు సమస్యలను పరిష్కరించాలని రైతు నాయకులు కోరారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు చొరవతో వీఎంఆర్డీఏ కమిషనర్ కె.విశ్వనాథన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వేపగుంట రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను వివరించారు. ఈకార్యక్రమంలో 94వ వార్డ్ కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు, వేపగుంట రైతు ప్రతినిధులు గంట్ల దేవుడు, సాలాపు రమణ, సేనాపతి దేవుడు తదితరులు పాల్గొన్నారు.