మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన
యువ ఆర్మీ అధికారులను కొట్టివారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం ఇండోర్ సమీపంలోని మౌ వద్ద ఘటన కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అక్షర కిరణం, (ఇండోర్/జాతీయం): మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితురాళ్లతో కలిసి రాత్రివేళ బయటకు వెళ్లిన ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై ఓ గుంపు దాడికి పాల్పడిరది. అనంతరం అధికారుల స్నేహి తురాళ్లలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసు కుంది. ఇండోర్ అదనపు ఎస్పీ రూపేశ్ ద్వివేదీ మాట్లాడు తూ.. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో ఆరుగురు అనుమానితులను గుర్తించామని, సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇద్దర్ని అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. మూక దాడిలో ఓ ఆర్మీ అధికారి గాయపడినట్టు తెలిపారు.
మౌ ఇన్ఫాంట్రీ స్కూల్లో యంగ్ ఆఫీసర్స్ కోర్సులో శిక్షణ పొందుతున్న 23, 24 ఏళ్ల అధికారులు.. తమ స్నేహితురాళ్ల తో కలిసి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మోవ్-మండలేశ్వర్ రహదారిపై ఉన్న పిక్నిక్ స్పాట్ జామ్ గేట్‌కు వెళ్లారు. యువ సైనికులు ఆ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఆరేడుగురు గుర్తుతెలియని వ్యక్తులు గొడవ పడ్డారు. కారులో ఉన్న ఆర్మీ అధికారి, అతడి స్నేహితురాలిని కొట్టడం ప్రారంభించారు. సమీపంలోని కొండపై ఉన్న మరో అధికారి ఘర్షణ విని అక్కడకు చేరుకున్నారు. ఇంతలో కారులో ఉన్న మహిళను సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈఘటనపై సీనియర్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చేలోగా పోలీసులు అక్కడకు చేరుకున్నట్లు మౌ రూరల్ ఎస్పీ హితికా వాసల్ తెలిపారు. పోలీసుల రాకను గమనించి దుండగులు.. అక్కడ నుంచి పరారయ్యారని అన్నారు. తలకు తుపాకి గురిపెట్టి నేరస్థులు బెదిరించి, యువతిని లాక్కెళ్లినట్టు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వదలిపెట్టాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. వారి వద్ద మొబైల్ ఫోన్లు, నగదు కూడా దోచుకున్నట్టు చెప్పారు.
నలుగురు బాధితులను వైద్య పరీక్షల కోసం మౌ సివిల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. గాయాల ఆనవాళ్లు సహా ఓ మహిళపై దుండగు లు అత్యాచారం చేసినట్లు తేలింది. నిందితులపై దోపిడి, అత్యాచారం, అక్రమ ఆయుధాలు తదితర చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వాసల్ వెల్లడిరచారు. నాలుగు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది బృందాలుగా ఏర్పడి.. నేరస్తుల కోసం గాలిస్తున్నారని, ఇప్పటి వరకూ ఇద్దరు పట్టుబడ్డారని వివరించారు.