రంగసాయి కళాపీఠం ఆవిర్భావం
ఇక నుంచి ప్రజల వద్దకే నాటకాలు, వివిధ కళలు, కళారూపాలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): నాటక అభిమానిగా, నాటకమే శ్వాస గా, ధ్యాసగా అనునిత్యం కళారంగం కోసం పరితపించే బాదంగీర్ సాయి మరో నూతన ఆలోచనకు అంకురా ర్పణ చేశారు. ప్రజల వద్దకే నాటకం, ప్రజల వద్దకు వివిధ కళారూపాలను తీసుకెళ్లటమే. అందుకోసం నూతన సంస్థ ‘రంగసాయి కళాపీఠం’ (సకల కళా సమాహారం) ఏర్పాటు చేశారు. ప్రముఖ పౌరాణిక నటులు, హార్మోనిస్ట్ తన తండ్రి డాక్టర్ ఆశపు వీరేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన ప్రముఖ వైద్యుడు, కళాభి మాని, కళాపోషకులు డాక్టర్ పీవీ రమణమూర్తి చేతుల మీదుగా రంగ సాయి కళాపీఠం ఆవిర్భావం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల, సినీ నటి శివజ్యోతి, రంగసాయి టీమ్ సభ్యులు ఆదినారాయణ, వియ్యపు రామకృష్ణ, జమ్మా చినబాబు పాల్గొ న్నారు. డాక్టర్ రమణమూర్తి మాట్లాడు తూ ఇప్పటికే బాదంగీర్ సాయి 36 సంవత్సరాలుగా నిరంతరం తనదైనశైలి లో కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా నాటకాలకు తొలి డ్రామా లైబ్రరీని ప్రారంభించారని తెలి పారు. సాయి ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు రూపొందించి, తెలుగు ప్రేక్షకులకు ఇంకా చేరువ కావాలని ఆకాంక్షించారు. కళాపీఠం వ్యవస్థాప కుడు బాదంగీర్ సాయి మాట్లాడుతూ ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఇటు వంటి కార్యక్రమాలు నిర్వహించటంలో ఏదో తెలియని శక్తి ముందుకు నడిపి స్తుందన్నారు. ఈనెల ఎనిమిదిన పీఎం పాలెం ఎంవీపీ సిటీలో ప్రయోగాత్మకం గా ప్రముఖ రంగస్థల నట దర్శకులు పి.శివప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శిం చిన పుటుక్కు జరజర డుబుక్కుమే హాస్య నాటికను ప్రజలు విశేషంగా ఆద రించారన్నారు. ఇక నుంచి ప్రజల కోసం-ప్రజల వద్దకే కళలు ప్రాతిపది కన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా మన్నారు. రంగసాయి కళాపీఠంతో బహుళ అంతస్తుల భవనవాసులులో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.