26న శివరాత్రి జాతరకు రామతీర్థం ముస్తాబు
26 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
వైష్ణవ క్షేత్రంలో శివరాత్రి జాతర ఇక్కడి ప్రత్యేక
అక్షర కిరణం, (నెల్లిమర్ల/ విజయనగరం): ‘ఆంధ్రా భద్రాద్రి’గా పేరు గాంచిన రామతీర్థం పుణ్యక్షేత్రం శివరాత్రి జాతరకు ముస్తాబైంది. ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు జరిగే ఉత్సవాలకు దేవస్థానం లోని క్షేత్రపాలకులైన శ్రీఉమా సదాశివ స్వామి ఆలయంతోపాటు ప్రధాన ఆల యం శ్రీరామస్వామి వారి ఆలయం సిద్ధమైంది. 26, 27 తేదీల్లో నిరంతరా యంగా భక్తులకు దర్శనాలకు అవకా శం కల్పిస్తారు. 28వ తేదీన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఉత్సవా లు ముగుస్తాయి. రామతీర్థంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశా రాష్ట్రం నుంచి 5 లక్షల వరకు భక్తులు విచ్చేస్తారు. ఈ మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందు లు కలగకుండా దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీవైష్ణవ క్షేత్రంలో ‘శివరాత్రి’ జాతర
సాధారణంగా శైవక్షేత్రాల్లో మాత్రమే శివరాత్రి జాతర నిర్వహిస్తారు. అయితే వైష్ణవ క్షేత్రమైన రామతీర్థంలో మాత్రం కొన్ని శతాబ్దాలుగా జాతర నిర్వహిస్తు న్నారు. రాముడే శివుడని, శివుడే రాముడని నమ్మిన భక్తులు ఇక్కడి జాతరకు లక్షలసంఖ్యలో వస్తారు. క్షేత్రపాలకులు ఉమాసదాశివ స్వామి కావడం కూడా ఇంత పెద్ద జాతర నిర్వహించడానికి మరో కారణం. రాములోరి సన్నిధిలో శ్రీరాముడితో పాటు ఆ మహా శివుడిని దర్శించు కుని, పవిత్రమైన శివరాత్రి నాడు రాత్రంతా భక్తులు జాగరణ చేస్తారు. ఆలయ ప్రాంగణంలో కోలలు ఏర్పాటు చేసుకుని రోజంతా భజనలు చేస్తారు.
రామతీర్థం ప్రాశస్త్యం ఇదే..!
జిల్లా కేంద్రం విజయనగరా నికి రామతీర్థం పుణ్యక్షేత్రం 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ పుణ్య క్షేత్రాన్ని 16వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ పాండవు లు కొంతకాలం నివసించినట్లుగా పౌరాణిక గాథలు చెబుతున్నాయి. ఇదే ప్రాంతంలో బౌద్ధులు సంచరించినట్లు గా ఆనవాళ్లు ఉన్నాయి. నీటిలో లభ్యమైన సీతారాముల విగ్రహాలను ఇక్కడి ఆలయంలో ప్రతిష్టించడం వల్ల ఈ క్షేత్రానికి ‘రామతీర్థం’ అనే పేరు వచ్చింది. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాలకు ఐదు శతాబ్దాలుగా నిరంత రాయంగా పూజలు అందుతున్నాయి. ఇక్కడున్న బోధికొండపైన కోదండ రామస్వామి ఆలయం ఉంది. కొండ పైకి వెళ్లేందుకు మెట్ల మార్గం నిర్మిం చారు. బోధికొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు వీలుగా ప్రస్తుతం బీటీ రోడ్డు నిర్మాణంలో ఉంది.
చూడదగిన ప్రదేశాలు ఇవే:
రామతీర్థం జాతరకు విచ్చేసే భక్తులు, యాత్రికులు చూసేందుకు పలు చారిత్రక ప్రదేశాలున్నాయి. బోధి కొండపైన పాండవుల గుహ, సీతమ్మ వారి పురిటి మంచం ఇప్పటికీ ఉన్నాయి. మండు వేసవిలో సైతం ఎండిపోని కొలను ఇదే కొండపైన ఉంది. 11వ శతాబ్దంలో బౌద్ధుల సమావేశానికి గుర్తుగా నిర్మించిన ఆరామాలు ఇప్పటికీ ఇక్కడున్న గురు భక్తుల కొండపైన ఉన్నాయి. దీని సమీపంలో ఉన్న దుర్గభైరవ కొండపైన అమ్మవారి పురాతన ఆలయం ఉంది. ఇవేగాకుండా ప్రధాన ఆలయం పక్కనున్న భాస్కర పుష్కరిణి కూడా భక్తులు చూడదగిన ప్రదేశమే.
జాతరకు చురుగ్గా ఏర్పాట్లు:
రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు జరిగే శివరాత్రి జాతరకు దేవాదాయ శాఖ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర, తూర్పురాజ గోపు రాలతో భక్తులు దర్శనానికి వెళ్లేందుకు వీలుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇప్పటికే నాలుగు లైన్ల బారి కేడ్లు నిర్మించారు. అలాగే ఎక్కడి కక్కడ డస్ట్ బిన్లు అందుబాటులో ఉంచనున్నారు. రెండ్రోజుల పాటు భక్తు లకు పులిహోర, శనగలు ప్రసాదం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. అలాగే భక్తులకు విక్రయిం చేందుకు లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నారు. ఉత్సవ ప్రత్యేకాధికారి ప్రసాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.