జాతీయ చదరంగం పోటీలకు రమన్ సిద్ధార్థ ఎంపిక
అక్షర కిరణం, (విశాఖపట్నం): కాకినాడలో ఈనెల 16 17 తేదీలలో రాష్ట్రస్థాయి అండర్ 17 చదరంగా పోటీ లు నిర్వహించారు. దీనిలో విశాఖ జిల్లాకు చెందిన రమన్ సిద్ధార్థ జాతీయ స్థాయి చదరంగ పోటీలకు అర్హత సాధిం చాడు. కేవీవీ శర్మ చీఫ్ అడ్వైజర్ ఏసీఏ, ఏసీఏ ప్రెసిడెంట్ ఏ సురేష్, కార్యదర్శి జగదీష్, నుంచి రమన్ సిద్ధార్థకు మెమోంట్, సర్టిఫికెట్, క్యాష్ ప్రైజ్ అందజేశారు. విశాఖ జిల్లా అండర్ 17 ఓపెన్ గర్ల్స్ -2025 చదరంగం సెలక్షన్స్ సమతా డిగ్రీ కాలేజ్‌లో ఆగస్టు 3 తేదీన నిర్వహించారు. దీనిలో 4వ స్థానం బుచ్చ్ ప్రోగ్రెస్‌లో సరిపెట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ అతనికి ప్రత్యేక ఎంట్రీ ఇప్పించి స్టేట్‌కి పంపించింది. అక్టోబర్ 5 నుండి 13వ తేదీ వరకు 2025న బీహార్ లో నిర్వహించే అండర్ 17 నేషనల్‌కు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బాబురావు, కార్యదర్శి మణికంఠ రావు, కోశాధికారి ఉమామహేశ్వర రావు, సీఏవో శ్రీకాంత్ అభినందనలు తెలిపారు.